నేడు యాగంటిపల్లెకు రానున్న మంత్రి బీసీ

నేడు యాగంటిపల్లెకు రానున్న మంత్రి బీసీ

NDL: బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించనున్నారు. యాగంటిపల్లె గ్రామంలో సాయంత్రం 4గంటలకు నిర్వహించే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. మండలంలోని అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.