రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
NLR: మనుబోలు మండలం కొమ్మలపూడి వద్ద గురువారం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 ఏళ్ల అఖిల్ మృతి చెందాడు. నెల్లూరులో ఉపాధి కోసం బైకుపై వెళుతున్న అఖిల్, నిరంజన్లను లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిరంజన్‌కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.