అభిషేక్ శర్మ హిస్టరీ రిపీట్ చేస్తాడా..?

అభిషేక్ శర్మ హిస్టరీ రిపీట్ చేస్తాడా..?

ముంబైలోని వాంఖడే స్టేడియం అంటేనే అభిషేక్ శర్మకు పూనకం వస్తుంది. గతేడాది ఇదే మైదానంలో ఇంగ్లండ్‌పై 54 బంతుల్లోనే 135 పరుగులు బాది వీరవిహారం చేశాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇప్పుడు సరిగ్గా అదే ప్రత్యర్థి, అదే వేదికపై రేపు సెమీస్ జరగనుంది. దీంతో అభిషేక్ శర్మపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి రేపటి మ్యాచ్‌లో అభిషేక్ ఏం చేస్తాడో చూడాలి.