పోలీంగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ
SRPT: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా, మద్దిరాల మండలంలోని గోరెంట్ల, చౌలతండా, మరియు రాజనాయకతండా గ్రామాలలో ఉన్న పోలింగ్ స్టేషన్ల కేంద్రాలను ఈరోజు సీఐ నరసింహారావు పరిశీలించారు. పోలింగ్ రోజున పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ప్రశాంత ఎన్నికల కోసం గ్రామస్థులు సహకరించాలని కోరారు. గొడవలు, ఘర్షణలు, వాగ్వాదాలకు దిగరాదని సూచించారు. ఎస్సై వీరన్న ఉన్నారు.