ఉప్పల్ కేంద్రంగా మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పాలన..!

ఉప్పల్ కేంద్రంగా మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పాలన..!

MDCL: మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పాలనకు ఉప్పల్ కేంద్ర బిందువు కానుంది. ఉప్పల్ భగాయత్‌లో సొంతంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ 10 ఎకరాలలో రూ.98 కోట్లతో ఆధునిక హంగులతో నిర్మించనున్నారు. ఇప్పటికే స్థల పరిశీలన జరిగింది.ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, మేడ్చల్ ప్రాంతాలకు ఉప్పల్ సెంటర్ కావడం, ప్రభుత్వ భూమి పుష్కలంగా ఉండటంతో ఉప్పల్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.