షీ టీమ్ కార్యాలయాన్ని సందర్శించిన: ఎస్పీ
SRPT: జిల్లా కేంద్రంలోని పోలీసు భరోసా సెంటర్, షీ టీమ్స్ కార్యాలయాన్ని ఎస్పీ నరసింహ ఇవాళ అకస్మికంగా సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన పలు రికార్డులను పరిశీలించారు. వేధింపులకు గురైన మహిళలకు, బాలికలకు ధైర్యం చెప్పడం, వేధింపులను నివారించడం ఈ కేంద్రాల నైతిక బాధ్యత అని తెలిపారు. పోక్సో చట్టం కింద కేసులు నమోదు అయితే జీవిత కాల శిక్షలు పడతాయని హెచ్చరించారు.