ఖమేనీ మృతి.. పలు రాష్ట్రాల్లో నిరసనలు

ఖమేనీ మృతి.. పలు రాష్ట్రాల్లో నిరసనలు

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతికి నిరసనగా జమ్మూకాశ్మీర్, యూపీలో ఆందోళనలకు దిగారు. జమ్మూలోని పలు ప్రాంతాల్లో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. లాల్‌చౌక్ వద్దకు భారీగా చేరుకుని ఖమేనీకి సంతాపం తెలిపారు. నల్లజెండాలు, ఖమేనీ చిత్రపటాలతో ప్రదర్శనలు నిర్వహించారు. సంతాప గీతాలను ఆలపిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారు.