' మోకులను గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి'
BHPL: రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు అందజేస్తున్నసేఫ్టీ మోకులను గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. ఎస్ఎం కొత్తపల్లి శివారు సోలిపేట తాటివనంలో వివిధ గ్రామాలకు చెందిన 150 మంది గీత కార్మికులకు సేఫ్టీ మోకులను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.