VIDEO: మనోహరాబాద్ మండలంలో తీవ్ర ఉద్రిక్తత..!
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయపల్లి పీటీ గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తున్నారని ఇరుపార్టీల నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఒకరిపైకి ఒకరు దాడి చేసుకున్నారు.