DEO నారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ వినతి

BHNG: యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా విభాగ కన్వీనర్ మణికంఠ గౌడ్ కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. చదువుకు నిలయమైన పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మక్కై అనుమతి లేని పాఠశాలల వ్యవహారశైలిపై పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.