'పారామెడికల్ సీట్ల కేటాయింపు పూర్తి'
SRPT: జిల్లాలోని 12 ప్రైవేట్ పారామెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు పూర్తయినట్లు DMHO వెంకటరమణ తెలిపారు. మొత్తం 425 మంది దరఖాస్తు చేసుకోగా, కౌన్సిలింగ్‌కు హాజరైన 392 మందికి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించారు. వివిధ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను సెలక్షన్ కమిటీ ద్వారా పారదర్శకగా నిర్వహించినట్లు తెలిపారు.