'PACS నూతన భవన నిర్మాణానికి చర్యలు'

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఆదివారం బాడంగి మండల కేంద్రంలోని PACS భవనాన్ని పరిశీలించారు. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో నిధులు మంజూరు చేసి నూతన భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువులు అందించి పంట రుణాలు సకాలంలో మంజూరయ్యేలా చూడాలని PACS అధ్యక్షుడు ఎల్.సత్యంను ఆదేశించారు.