యాప్ నిబంధనలతో రైతుల ఆందోళన

యాప్ నిబంధనలతో రైతుల ఆందోళన

ఉమ్మడి WGL జిల్లాలో సీసీఐ, కపాస్ యాప్ నిబంధనలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్, యాప్ బుకింగ్ లేకుండా పత్తి అమ్మకం జరగకపోవడంతో కౌలు రైతులు, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. యాప్‌లు ఉపయోగించలేక పంట అమ్మకం సాధ్యం కావడంలేదని రైతులు వాపోతున్నారు. అధికారులు సమస్యపై తక్షణం స్పందించి పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.