మద్యం కేసుల్లో ఇద్దరి బైండోవర్: ఎక్సైజ్ సీఐ

మద్యం కేసుల్లో ఇద్దరి బైండోవర్: ఎక్సైజ్ సీఐ

PLD: ఈపూరు ప్రోహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం కేసుల్లో ఉన్న ఇద్దరిని బైండోవర్ చేసినట్లు మంగళవారం ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కొండ్రముట్లకు చెందిన ఒక వ్యక్తిని, అంగలూరు గ్రామానికి చెందిన మరొకరిని తహశీల్దార్ వద్ద బైండోవర్ చేయడం జరిగిందన్నారు. నవంబర్ నెలలో ఈపూరు పరిధిలో మొత్తం 21 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన వివరించారు.