'అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు మంజూరు'
SKLM: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అనర్హులను జాబితా నుంచి పూర్తిగా తొలగించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన టెక్కలిలోని జగతిమెట్ట వద్ద ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.