VIDEO: మేడారానికి బయల్దేరిన పగిడిద్దరాజు
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి పగిడిద్ద రాజు బయల్దేరారు. పెనుక వంశీయులు ముందుగా పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా ముస్తాబు చేశారు. డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య శోభాయాత్రగా మేడారానికి ప్రారంభమయ్యారు. పగిడిద్దరాజు చేరిన తర్వాత జాతర అధికారికంగా ప్రారంభం అవుతుందన్నా విషయం తెలిసిందే.