'ఈ నెల 30న ప్రజా సమస్యల పరిష్కార వేదిక'
కృష్ణా: ఈనెల 30వ తేదీన సోమవారం ఉదయం 10:30 గంటలకు మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ బాలాజీ ఆదివారం అన్నారు. జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమస్యలను తెలియజేయాలని తెలిపారు. తద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు.