'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
GNTR: ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో భాగంగా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మంగళవారం రైతులను కలిశారు. ఇంటింటికి వెళ్లి రైతులకు కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత సాగు, రైతులకు ఆర్థిక సాయం వంటి అంశాలను వివరించారు.