VIDEO: తాగునీరు వృథా.. పట్టించుకోని అధికారులు
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని TR నగర్ 8వ వార్డులో 10 రోజులుగా తాగునీరు వృథాగా పోతోంది. కొత్త నల్లా కనెక్షన్ కోసం తవ్విన గుంత కారణంగా పైపులైన్ నుంచి నీరు బయటకు వస్తోంది. స్థానికులు మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని, నీటి వృథాను అరికట్టి తమ అవసరాలు తీర్చాలని కాలనీవాసులు కోరారు.