VIDEO: భోగాపురం హైవేపై నిలిచిన వరద నీరు
VZM: ఎడతెరపు లేకుండా కురుస్తున్న వానలకు భోగాపురం మండలం రాజాపులోవ వద్ద హైవే సర్వీస్ రోడ్డు జలదిగ్బంధం అయ్యింది. దీంతో విజయనగరం, శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్ రావు ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టి, జేసీబీతో నీటిని మళ్లించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.