అధికారులతో క్లెయిమ్స్ పై సమావేశం నిర్వహించిన డీఆర్వో
VZM: ఓటర్ల జాబితాలో సవరణకు వచ్చిన దరఖాస్తులు ఏడు రోజుల్లోగా పరిష్కారం కావాలని జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో క్లెయిమ్స్ పై సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ క్లెయిమ్స్ పై ఏఈఆర్వో, బిఎల్‌వోలతో మాట్లాడి వెంట, వెంటనే పరిష్కరించాలన్నారు.