చంద్రాయన్‌పల్లిలో చెరువును తలపించేలా వర్షపు నీరు
NGKL: చారకొండ మండలం చంద్రాయన్పల్లిలో సోమవారం కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్ల ముందు మోకాళ్ల లోతు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు అవసరమైన చోట కాకుండా ఇష్టానుసారంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.