16 ఏళ్ల బాలుడికి అరుదైన గౌరవం
VKB: తాండూరు మండలం సంగెంకలన్ గ్రామానికి చెందిన అరవింద్ (16) అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో నిర్వహించనున్న ఒగ్గుడోలు ప్రదర్శనకు ఇతడు ఎంపికయ్యాడు. ఇంత చిన్న వయసులో జాతీయ వేదికపై ప్రదర్శన ఇచ్చే అవకాశం రావడంపై అరవింద్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ అవార్డు గ్రహీత ఒగ్గు రవికి ధన్యవాదాలు తెలిపారు.