లోయర్ మానేరు జలాశయంలో రెండు గేట్లు ఎత్తివేత

లోయర్ మానేరు జలాశయంలో  రెండు గేట్లు ఎత్తివేత

KNR: సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు లోయర్ మానేరు జలాశయం (ఎల్ఎండీ) రెండు గేట్లను అధికారులు ఎత్తేశారు. ఎల్ఎండీలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో, రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు నుంచి వస్తున్న వరద కారణంగా గేట్లు ఓపెన్ చేసినట్లు అధికారులు తెలిపారు.