రాజేంద్రనగర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
HYD: రాజేంద్రనగర్ పరిధిలోని చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న సురేందర్ అనే వ్యక్తిని అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.