విజయవాడ రైతు బజార్లను తనిఖీ చేసిన మంత్రి
NTR: విజయవాడ పడమట రైతు బజార్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేసి కూరగాయల ధరలను మంగళవారం పరిశీలించారు. గింజ రకం చిక్కుడు, గోరుచిక్కుడు, టమాటా వంటి కూరగాయలు అందుబాటులో లేవని ప్రజలు వెల్లడించగా, అన్ని రకాల కూరగాయలు నిరంతరం లభ్యంగా ఉండేలా చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశించారు. బియ్యం, ధాన్యాలు నాణ్యతతో విక్రయించాలన్నారు.