రోడ్డు ప్రమాదం.. జిల్లా యువకుడు మృతి
KMM: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల పరిధిలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మంకు చెందిన కుసుమ సాయికృష్ణ(31) మృతి చెందాడు. స్కూటీపై వెళ్తుండగా కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. తలకు తీవ్రగాయమై హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.