భారీ మోసం.. రూ.20లక్షలు టోకరా

భారీ మోసం.. రూ.20లక్షలు టోకరా

VZM: జిల్లాకు చెందిన టీ. మోహన్ సైబర్ మోసానికి గురయ్యాడు. పరిశ్రమ స్థాపనలో సహాయం చేస్తానంటూ ఓ కేటుగాడు నమ్మించి రూ. 20 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు వివరించారు. మోహన్ నిందితుడి ఖాతాలో 9 సార్లు డబ్బు జమచేశాక, అతడు ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడన్నారు. మోహన్ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చౌదరి తెలిపారు.