గుంటూరు మార్కెట్ యార్డుకు 3 రోజులు సెలవు

గుంటూరు మార్కెట్ యార్డు మూడు రోజులపాటు మూతపడనుంది. శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కాగా, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా యార్డు పనిచేయదు. ఈ విషయం యార్డు కార్యదర్శి ఎ. చంద్రిక శుక్రవారం వెల్లడించారు. సెలవు రోజుల్లో రైతులు తమ ఉత్పత్తులు యార్డుకు తీసుకురాకుండా జాగ్రత్త వహించాలని కోరారు.