ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

రోనసీమ: ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. అమలాపురం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే ప్రజల నుంచి 32 వినతులు స్వీకరించారు. ప్రతి సమస్యపై కూలంకషంగా చర్చించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.