అండర్-14 క్రికెట్ పోటీలకు కోదాడ వాసీ ఎంపిక

అండర్-14 క్రికెట్ పోటీలకు కోదాడ వాసీ ఎంపిక

SRPT: కోదాడకు చెందిన పోలంపల్లి వసంత్ గౌడ్ జాతీయ స్థాయి అండర్-14 క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. జూలై 28న ఏలూరులో జరిగిన హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాసమితి క్రికెట్ సెలక్షన్‌లో వసంత్ గౌడ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిభావంతులను అధిగమించి, తన అసాధారణ ప్రతిభతో ఈ ఘనత సాధించినట్లు కోచ్ సిద్దిక్ తెలిపారు.