రంజాన్ తోఫాను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బాపట్ల జిల్లాలోని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ క్యాంపు కార్యాలయంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. బాపట్లలోని వివిధ మసీదులలో నిరంతరం సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్లకు ఈ తోపాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినం క్రమశిక్షణ, త్యాగం దాతృత్వానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.