నేడు డీసీసీ నూతన కమిటీ కీలక భేటీ
TG: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ(DCC) నూతన కార్యవర్గ తొలి సమావేశం ఇవాళ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఈ భేటీలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి.