గ్రంథాలయంలో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు
CTR: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం పుంగనూరు గ్రంథాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఝూన్సీలక్ష్మీభాయి, భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, సావిత్రిబాయి పూలే వంటి వారు దేశానికి చేసిన సేవలు గురించి విద్యార్థులకు వివరించారు.