'వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు'

ప్రకాశం: సంతనూతలపాడు నేటి నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నట్టు కమిటీ అధ్యక్షుడు వేమా మల్లేశ్వరరావు తెలిపారు. ముందుగా అమ్మవారికి కలశ స్థాపన, లక్ష మల్లెల పూజ, కుంకుమ పూజలు, ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.