BJP పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
ASF: కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎడ్ల శంకర్, మాజీ వార్డు మెంబర్ రస్పల్లి చిన్నన్న శనివారం కాంగ్రెస్ పార్టీ నుంచి BJPలో చేరారు. వీరికి సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో BJPని బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ నడుంబిగించి పని చేయాలన్నారు.