100 ఏళ్ల తర్వాత మెక్సికోకి ట్రంప్ సైన్యం!
అగ్రరాజ్యం అమెరికా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మెక్సికోలో పనిచేస్తున్న డ్రగ్స్ ముఠాలను నిర్మూలించడానికి US పోరాట విభాగాలు, CIA బృందాలను పంపాలని అధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్నారు. ఈ ఆపరేషన్ నిజమైతే 100 ఏళ్లలో అమెరికన్ దళాలు మెక్సికన్ గడ్డపై అడుగు పెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది. మెక్సికోలో చివరి US సైనిక చర్య 1916లో జరిగింది, అప్పుడు జనరల్ జాన్ పెర్షింగ్ అధికారంలో ఉన్నాడు.