సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

MLG: సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన మాటను సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని, సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని మంత్రి సీతక్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.