విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే
GNTR: పొన్నూరు మండలంలోని చింతలపూడి గ్రామం జడ్పీ పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్తి ఉన్నా లేకపోయినా చదువే నిజమైన ఆస్తి అని, విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశానికి, ఊరికి, పాఠశాలకు పేరు ప్రతిష్టలు తేవాలని కోరారు. విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.