ఖమ్మంలో ఐటీ హబ్ విస్తరణ చేయాలని వినతి

ఖమ్మంలో ఐటీ హబ్ విస్తరణ చేయాలని వినతి

KMM: మంత్రి తుమ్మల తనయుడు, జిల్లా కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం నగరంలో ఐటీ హబ్ విస్తరణ చేయాలని, ఐటీ HUB ఫేజ్ -2 మంజూరు చేసి స్థలాన్ని కేటయింపు చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. అలాగే, జిల్లా అభివృద్ధి అంశాలపై చర్చించారు.