ఎన్టీఆర్ విగ్రహాలకు సుందరీకరణ పనులు
అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ రింగ్ రోడ్డు వద్ద గల ఎన్టీఆర్ విగ్రహాలకు సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి దాడి రత్నాకర్ తెలిపారు. ఈనెల 29వ తేదీన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాలను దత్తత తీసుకుని ఈ పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు.