ఉపాధ్యాయుల ఆటల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉపాధ్యాయుల ఆటల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

AKP: ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో డివిజన్ స్థాయి ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఆటల పోటీలను ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ శనివారం ప్రారంభించారు. 12 మండలాల నుంచి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పురుష ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు, మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలు అయిన వారు జిల్లాస్థాయికి అర్హత సాధిస్తారు.