'సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించండి'
BHPL: పట్టణంలోని సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఇవాళ కార్మిక సంఘం నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ.. కార్మికులను మభ్యపెట్టి కోల్ బెల్ట్ ఏరియాలో ఎమ్మెల్యే స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.