‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

బాపట్ల పాత బస్టాండ్ వద్ద ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం, బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో బాపట్ల నుంచి పిట్టలవానిపాలెం వరకు ప్రయాణించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.