శ్రీశైలం టోల్ గేట్ వద్ద మద్యం పట్టివేత
NDL: శ్రీశైలం టోల్ గేట్ వద్ద మస్తాన్ వలి అనే వ్యక్తి నుంచి 20 (180ML) క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రసాదరావు బుధవారం తెలిపారు. సదరు వ్యక్తిపై గతంలోనూ రెండు మద్యం కేసులు, ఒక దొంగతనం కేసు ఉన్నాయన్నారు. రిమాండ్ నిమిత్తం అతడిని ఆత్మకూరు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది రఘునాథుడు, బాలకృష్ణ, తదితరులు ఉన్నారు.