'ఆ వ్యర్ధాలు కలెక్టరెట్ ప్రాంగణంలో వేస్తే సహించేది లేదు'
VZM: కలెక్టరేట్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలలో వ్యర్ధాలు కలెక్టరెట్ ప్రాంగణంలో వేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, కలెక్టర్లు తమ పరిధిలోని కార్యాలయాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిపారు.