నాటుసారా కేంద్రాలపై పోలీసులు దాడులు

నాటుసారా కేంద్రాలపై పోలీసులు దాడులు

PPM: ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దు గ్రామాలైన సందుబడి, రేగలపాడులో ఎక్షైజ్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8,900 లీటర్ల బెల్లపు ఊట, 70 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. నాటుసారా కేంద్రాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసామని, నాటుసారా తయారీ, రవాణా, అమ్మకాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.