VIDEO: ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి

KKD: ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం 'సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో' భాగంగా కాకినాడ 39వ డివిజన్‌లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. 13 నెలల కాలంలో చేసిన అభివృద్ధిని వివరించారు.