'సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన'

పెద్దపల్లి కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ జాతీయ పతాకావిష్కరణ చేసి, పోలీసు వందనం స్వీకరించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే విజయరమణరావు, కలెక్టర్ శ్రీహర్ష, అధికారులు పాల్గొన్నారు.