ఇసుకను వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలి: కలెక్టర్

ఇసుకను వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలి: కలెక్టర్

SDPT: జిల్లాలో ఇసుక సరఫరాను వేగవంతం చేసేందుకు 'మన ఇసుక వాహనం' పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. పౌరులు tgmiv.cgg.gov.in వెబ్‌సైట్‌లో స్వయంగా బుక్ చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు రూ.12 చార్జీ చెల్లించాలని, ఇతరులు ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు రవాణా కోసం సొంత వాహనం ఏర్పాటు చేసుకోవాలన్నారు.